ఆందోళన తెలుపుతోన్న రాజధాని రైతులను కలవనున్న పవన్ కల్యాణ్

  • రేపు ఉదయం 8 గంటల నుంచే పవన్ పర్యటన
  • మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో భేటీ
  • రైతులతో నేరుగా మాట్లాడి ఇబ్బందులు తెలుసుకోనున్న పవన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై రైతులను కలిసి మాట్లాడడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అమరావతి రాజధాని విషయంపై రూపొందించిన ఓ నివేదికను పవన్ కల్యాణ్ కు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అందించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో స్వయంగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు.

రేపు ఉదయం 8 గంటల నుంచే పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో ఆయన మాట్లాడతారు. ఇటీవల మందడంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబుతో పాటు పలువురు పర్యటించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh

More Telugu News